తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ఖతాలో '100 మిలియన్స్' - జై లవకుశ 100 మిలియన్లు

టాలీవుడ్​ స్టార్​ హీరో జూ.ఎన్టీఆర్​ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు వెండితెరపై అదరగొట్టిన తారక్​... తాజాగా స్మార్ట్​తెరపైనా మరో రికార్డు సృష్టించాడు. 'జై లవకుశ' సినిమాలోని 'నీ కళ్లలోన కాటుక' పాట 100 మిలియన్ల మ్యాజిక్​ నంబర్​ను అందుకుంది.

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ ఖతాలో '100 మిలియన్లు'

By

Published : Nov 17, 2019, 4:13 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా 'జై లవకుశ'. బాబి దర్శకుడు, కల్యాణ్​రామ్​ నిర్మాత. రాశీఖన్నా, నివేథా థామస్​ కథానాయికలు. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించాడు. ఈ సినిమా విజయ దశమి కానుకగా 2017 సెప్టెంబర్​ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

జై లవకుశ సినిమాలో 'నీ కళ్లలోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా...' అని సాగే వీడియో సాంగ్ ​ తాజాగా 100 మిలియన్ల వీక్షణలతో రికార్డు సృష్టించింది. తారక్​ కెరీర్​లో ఈ మైలురాయి అందుకున్న తొలి పాటగా ఘనత సాధించింది.

గతంలోనూ...

ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసినప్పుడు టాలీవుడ్‌లో రికార్డులు సృష్టించింది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 7.24 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఫలితంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత వేగంగా ఎక్కువగా వ్యూస్ దక్కించుకున్న రెండో చిత్ర ట్రైలర్‌గా పేరు తెచ్చుకుంది.

ABOUT THE AUTHOR

...view details