తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫొటోగ్రాఫర్​పై ఎన్టీఆర్​ పంచులు... వీడియో వైరల్​ - Young Tiger NTR Conversation With Photographer In Vizag Airport After #RRR Shoot

యంగ్​టైగర్ ఎన్టీఆర్​కు అభిమానుల్లో ఉండే క్రేజ్​ వేరు. అతడి వ్యక్తిత్వం, నటన, ఎదుటివారిని పలకరించే తీరుకు చాలా మంది ముగ్ధులవుతారు. ఇప్పుడు అలాంటిదే జరిగింది. ఓ ఫొటోగ్రాఫర్​ను గుర్తుపట్టి మరీ, ఎన్టీఆర్ పలకరించాడు. ఆ వీడియో వైరల్​గా మారింది.

Young Tiger NTR Conversation With Photographer In Vizag Airport After #RRR Shoot
ఫొటోగ్రాఫర్​కు ఎన్టీఆర్​ పంచులు... నెట్టింట వీడియో వైరల్​

By

Published : Jan 21, 2020, 1:41 PM IST

Updated : Feb 17, 2020, 8:51 PM IST

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌.. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా బయట మాత్రం ఎంతో సరదాగా కనిపిస్తుంటాడు. తన చుట్టూ ఉండే వాళ్లను ఆటపట్టిస్తూ, అందర్నీ నవ్విస్తుంటాడు. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ ఫొటోగ్రాఫర్‌ను గుర్తుపట్టి మరీ, అతడిపై పంచులు వేశాడుఎన్టీఆర్‌.

ఓ వాణిజ్య ప్రకటన నిమిత్తం ముంబయి వెళ్లిన ఎన్టీఆర్‌... తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడు నడుచుకుంటూ వస్తుండగా, అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్‌తారక్​ను ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. గమనించిన ఎన్టీఆర్‌.. ఆ ఫొటోగ్రాఫర్‌ను దగ్గరికి పిలిచి.. 'నువ్వు ఇక్కడే ఉంటావా..? తిండి, స్నానం అన్నీ ఇక్కడేనా?' అని ఆటపట్టించాడు. ఎన్టీఆర్​ మాటలు విన్న అక్కడున్న వాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు. తనను ఎన్టీఆర్‌ గుర్తుపట్టి మరీ మాట్లాడటంపై ఆ ఫొటోగ్రాఫర్‌ ఉబ్బితబ్బిబయ్యాడు.

గతంలోనూ ఎన్టీఆర్‌ ఎయిర్‌పోర్టు వెళ్లినప్పుడు అతడు ఫొటోలు తీశాడట. ఆ విషయాన్ని ఈ స్టార్​ హీరో గుర్తుపెట్టుకున్నాడు. మళ్లీ ఆ ఫొటోగ్రాఫరే విమానాశ్రయంలో కనిపించగా ఇలా ఆటపట్టించాడు. ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందుకే ఎన్టీఆర్​ స్టార్​ అయ్యాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఎస్‌ఎస్.రాజమౌళి తీస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్‌. ఈ అక్టోబర్‌లో సినిమాను అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

Last Updated : Feb 17, 2020, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details