తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భలే ఛాన్స్​లే!: స్టార్​ హీరోలతో యువ దర్శకులు

చిత్రపరిశ్రమలో హిట్టు కొట్టిన డైరెక్టర్​తో సినిమాలు చేయడానికి స్టార్​ హీరోలు ఆసక్తి చూపుతారు. బట్​ ఫర్​ ఏ ఛేంజ్​.. అనుభవంతో సంబంధం లేకుండా యువ దర్శకులకూ ఇప్పుడు ఛాన్స్​లు ఇస్తున్నారు మన​ అగ్ర కథానాయకులు. టాలీవుడ్​ స్టార్​ హీరోల నుంచి అవకాశాలు దక్కించుకున్న యంగ్​ డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం.

Young directors who hit the chance to direct  Tollywood Star Heroes
భలే ఛాన్స్​లే!: యువ దర్శకులకు స్టార్​ హీరోల సినిమాల్లో అవకాశం​

By

Published : Nov 23, 2020, 7:47 AM IST

విజయవంతమైన కలయికలు...స్టార్‌ కలయికల్లో సినిమాలు తరచూ కుదిరేవే. ఒకసారి హిట్‌ సొంతమైందంటే అతి త్వరలోనే ఆ కలయికలో సినిమా ఉంటుందని ప్రేక్షకులతోపాటు మార్కెట్‌ వర్గాలు ఓ అంచనాకొస్తుంటాయి. హిట్టు అనే మాట అలా ప్రభావం చూపిస్తుంటుంది. మళ్లీ మళ్లీ కలిసి పనిచేసేందుకు కారణమవుతుంది. ఒక స్టార్‌ హీరో, మరో స్టార్‌ దర్శకుడితో కలిసి సినిమా చేయడం కూడా సాధారణమైన విషయమే. కొన్నిసార్లు మాత్రం అనూహ్యంగా కొన్ని కలయికలు కుదురుతుంటాయి. రేసులో లేని దర్శకులు సైతం అగ్ర హీరోలతో సినిమాలు చేసే అవకాశాల్ని సొంతం చేసుకుంటుంటారు. అలాగే కుర్ర హీరోలూ అగ్ర దర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. తెలుగులో అలాంటి కలయికలు ప్రస్తుతం చాలానే కనిపిస్తున్నాయి.

బాలకృష్ణ - బోయపాటి శ్రీను

ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌

పవన్‌కల్యాణ్‌ - హరీశ్​ శంకర్‌

అల్లు అర్జున్‌ - సుకుమార్‌

... ఇవన్నీ విజయవంతమైన కలయికలు. ప్రేక్షకులు ఆశించిన... మార్కెట్‌ డిమాండ్‌ చేసే కలయికలు ఇవి. వీళ్లు మరోసారి జట్టు కట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు...అంచనాలు తప్ప! మహేశ్​బాబు - పరశురామ్‌, ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ తదితర కొత్త కలయికలు కూడా ప్రస్తుతం ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆయా దర్శకులు అంతకుముందు సాధించిన విజయాలు వాళ్లకు స్టార్లని దర్శకత్వం చేసే అవకాశాన్ని కట్టబెట్టాయి. వీటికి భిన్నమైన కలయికలూ కొన్ని ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి.

సాగర్​ కె చంద్ర, పవన్​ కల్యాణ్​

పవన్‌ పిలుపు... నాగ్‌ మరోసారి

పవన్‌కల్యాణ్‌ కూడా పలువురు నవతరం దర్శకులకు అవకాశాలిచ్చారు. శ్రీరామ్‌ వేణుతో 'వకీల్‌సాబ్‌' చేస్తున్న పవన్‌ కల్యాణ్‌, 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' రీమేక్‌ కోసం సాగర్‌ కె.చంద్రని ఎంచుకున్నారు. 'అయ్యారే', 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలు తీసిన సాగర్‌ కె.చంద్రకు పవన్‌తో సినిమా అంటే భలే మంచి అవకాశమే. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడంలో ముందుండే నాగార్జున మరోసారి ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ అహిసోర్‌ సాల్మన్‌తో 'వైల్డ్‌డాగ్‌' చేస్తున్నారు. రచయితలు పలువురు అగ్ర తారల సినిమాలకు పనిచేసిన సాల్మన్‌కు ఇది మంచి అవకాశమే.

నాగార్జున, అహిసోర్​ సాల్మన్​
మెహర్​ రమేశ్​, బాబీ

చిరు సినిమాలతో...

అగ్ర కథానాయకుడు చిరంజీవితో ఒక్క సినిమానైనా చేయాలనేది ఎంతోమంది దర్శకులు కనే కల. ట్రెండ్‌కు తగ్గట్టుగా యువ దర్శకులతో కలిసి పని చేయాలన్న చిరంజీవి ఆలోచన పలువురు కొత్త తరం దర్శకుల కలని నెరవేరుస్తోంది. కొన్నాళ్ల కిందటే మెహర్‌ రమేశ్​, కె.ఎస్‌.రవీంద్రనాథ్‌ (బాబీ), సుజీత్‌లతో కలిసి సినిమాలు చేస్తున్నట్టు చిరంజీవి ప్రకటించారు. సుజీత్‌ ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేయడం లేదు కానీ, మెహర్‌ రమేశ్​, బాబీలు స్క్రిప్టులతో సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, వెంకటేశ్​ లాంటి అగ్ర తారలతో సినిమాలు చేశారు మెహర్‌ రమేశ్​. కానీ కొన్నాళ్లుగా పరాజయాలతో సతమతమవుతున్న ఆయన చిరంజీవితో సినిమా చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. 'వేదాలం' రీమేక్‌ కోసం ఆయన స్క్రిప్టును తయారు చేసిన విధానం చిరంజీవికి నచ్చి అవకాశాన్ని కట్టబెట్టారు. బాబీ కూడా రవితేజ, ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌లతో సినిమాలు చేశారు. ఆయన మళ్లీ యువ కథానాయకులతో సినిమాలు చేస్తారనుకున్నారు కానీ, ఏకంగా చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. భవిష్యత్తులో మరికొంతమంది యువ దర్శకులు చిరుతో సినిమాలు చేసే అవకాశం ఉంది.

దర్శకుడు క్రిష్​, వైష్ణవ్​ తేజ్​

నాయకా నాయికలు కూడా

దర్శకులే కాదు, తారలు కూడా ఊహించని రీతిలో అగ్ర దర్శకులతో సినిమాలు చేసే అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నారు. తక్కువ సమయంలోనే ప్రేక్షకులపై బలంగా ప్రభావం చూపించిన విజయ్‌ దేవరకొండ...అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌తో 'ఫైటర్‌' చేస్తున్నారు. తదుపరి మరో స్టార్‌ దర్శకుడు సుకుమార్‌తోనూ సినిమా చేయనున్నారు. కొత్త హీరో వైష్ణవ్‌తేజ్‌ కూడా అలాంటి మంచి అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. అగ్ర దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో సినిమాని పూర్తి చేశాడు. తొలి సినిమా విడుదల కాకమునుపే క్రిష్‌తో జట్టు కట్టిన ఆయన ఇప్పుడు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. కథానాయికలూ ఎప్పుడు ఏ వైపు నుంచైనా మంచి అవకాశాలు తలుపు తట్టొచ్చనే ఆశావహ ధృక్పథంతో కనిపిస్తున్నారు. రేసులో లేని భామలు ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ అనూహ్యంగా బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details