'ఎవడే సుబ్రహ్మణ్యం', 'మహానటి' వంటి చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రస్తుతం యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో భారీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యమున్న కథతో సినిమా రూపొందించబోతున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి పంథాను ఎంచుకోనున్నాడట అశ్విన్. సాధారణంగా చిత్రం థియేటర్లలోకి వచ్చే ముందే జక్కన్న తాను తీయబోయే కథను ప్రేక్షకులకు చెప్పేస్తాడు. తద్వారా వారు ముందుగానే ఓ ఆలోచనతో సినిమా చూసేందుకు వస్తారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా ఈ తరహా పంథాను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది.
థియేటర్లలోకి రాకముందే సినిమా కథ రివీల్! - ప్రభాస్ కొత్త సినిమాలు
యువ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ 21వ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు వినూత్న పంథాను ఎంచుకోనున్నాడని సమాచారం. సినిమా ప్రారంభోత్సవం రోజే కథంతా ప్రేక్షకులకు చెప్పేస్తాడట.
సినిమా కథ విషయంపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో వీటన్నింటికి చెక్ పెట్టాలని యువ దర్శకుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చిత్ర ప్రారంభోత్సవం రోజే కథా నేపథ్యాన్ని చెప్పనున్నాడట అశ్విన్. అంతేకాకుండా చిత్రంలోని పాత్రలను విభిన్న రీతిలో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో వాస్తవమెంత ఉందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం ప్రభాస్ 'జాన్' (వర్కింట్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నాడు. 'జిల్' ఫేం రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.