అభిమానుల అత్యుత్సాహం కొన్నిసార్లు నటుల్ని ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. అలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి. ఇలాంటి ఓ అనుభవమే 'ఒరు అదార్ లవ్'(తెలుగులో 'లవర్స్ డే') చిత్రంతో పేరు తెచ్చుకున్న మలయాళ నటి నూరిన్ షరిఫ్కు ఎదురైంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
ఆదివారం.. మంజేరిలో జరిగిన ఓ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవంలో పాల్గొంది నూరిన్. అభిమానులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. అందులో ఓ వ్యక్తి.. ఈ భామ ముక్కుపై పంచ్ ఇవ్వడం వల్ల రక్తం వచ్చింది. అనంతరం ఆమె ఏడుస్తూ ఉండటం ఈ వీడియోలో కనిపించింది.