ప్రముఖ బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ల వివాహం జరిగి నేటికి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రియాంక తన భర్తకు ప్రేమతో ప్రత్యేక సందేశాన్ని పంపింది.
"నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు నా జీవితంలోకి ఆనందం, దయ, సమతుల్యత, ఉత్సాహం, అభిరుచి అన్నీ ఒకేసారి తీసుకొచ్చారు. నన్ను గుర్తించినందుకు (భార్యగా చేసుకున్నందుకు) ధన్యవాదాలు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నిక్."