మెగా మేనల్లుడు సాయి తేజ్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ప్రచారచిత్రం బట్టి చూస్తే ఇదొక హాస్యభరితమైన కుటుంబకథాచిత్రం అని తెలుస్తుంది. తాజాగా ఈ మూవీలోని 'యూ ఆర్ మై హై' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. రాశీ ఖన్నా గాత్రంతో రూపొందించిన ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది.
రాశీ ఖన్నా గాత్రంతో 'యూ ఆర్ మై హై' సాంగ్ - రాశీఖన్నా
టాలీవుడ్ యువ కథానాయకుడు సాయితేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. ఈ సినిమాలోని 'యూ ఆర్ మై హై' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం.
you are my high
ఈ చిత్రంలో తాతా మనవడి మధ్య సాగే అనుబంధాలకు పెద్ద పీట వేశారు. తాత పాత్రలో కట్టప్ప సత్యరాజ్ నటించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ సినిమా.
ఇవీ చూడండి.. 'ఐఎమ్డీబీ' టాప్-10లో తెలుగు సినిమాకు దక్కని చోటు