తమిళ హాస్యనటుడు యోగిబాబు.. బుధవారం తిరుత్తనిలోని మురుగన్ దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. అతడి స్నేహితురాలైన మంజు భార్గవిని పెళ్లాడాడు. ఈ కార్యక్రమానికి కొంతమంది సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు.
ఓ ఇంటివాడైన ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు - Comedian Yogi babu
తమిళ హాస్యనటుడు యోగిబాబు పెళ్లి చేసుకున్నాడు. బుధవారం తిరుత్తనిలోని మురుగన్ ఆలయంలో మంజుభార్గవిని వివాహమాడాడు.
![ఓ ఇంటివాడైన ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు Yogi Babu Ties the Knot with Manju Bhargavi in Intimate Ceremony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5962971-253-5962971-1580881524174.jpg)
ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు వివాహం
సినీనటుల కోసం మార్చిలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నానని ట్విట్టర్లో వెల్లడించాడు యోగి. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమని సినీవర్గాలు తెలిపాయి. యోగిబాబు తాజాగా ధనుష్‌తో 'కర్నాన్' చిత్రంలో నటించాడు.
ఇదీ చూడండి..ఐఫా అవార్డుల వేడుక షురూ.. వ్యాఖ్యాతగా సల్మాన్
Last Updated : Feb 29, 2020, 6:20 AM IST