పవర్ స్టార్ పవన్‌కల్యాణ్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 'వకీల్‌సాబ్'తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందులో లాయర్‌గా నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఒక్క ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మినహా మిగతా చిత్రీకరణ అంతా పూర్తయినట్లు సమాచారం. పవన్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందనేది ఇప్పటివరకు ఖరారు కాలేదు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
పవన్ 'వకీల్‌సాబ్'లో మరో స్టార్ హీరోయిన్? - వకీల్ సాబ్ తాజా వార్తలు
పవర్ స్టార్ 'వకీల్‌సాబ్'లోని ఓ కీలక పాత్ర కోసం పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో ముఖ్యంగా శ్రుతిహాసన్, ఇలియానా ఉన్నారట.
తొలుత ఈ పాత్రలో శ్రుతిహాసన్ నటిస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో ఇలియానా పేరు వినిపిస్తోంది. వీరిద్దరిలో ఎవరు నటిస్తారనేది ఈ వారంలోపు తేలనుంది. గతంలో పవన్ సరసన 'గబ్బర్‌సింగ్', 'కాటమరాయుడు' చిత్రాల్లో శ్రుతిహాసన్.. 'జల్సా'లో ఇలియానా నటించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా 'మగువా మగువా' అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్రబృందం. తమన్ సంగీతమందించాడు. వేణు శ్రీరామ్ దర్శకుడు. బోనీకపూర్ సమర్పణలో దిల్‌రాజు.. బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.