తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తొలి పాటతో ఆకట్టుకుంటున్న 'మంచోడు' - ఎంత మంచివాడవురా సినిమా మొదటి పాట

కల్యాణ్​ రామ్​ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. తాజాగా ఈ సినిమా తొలి గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. సతీష్​ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు.

yentha manchivadavura movie first song released
' తొలి పాటతో ఆకట్టుకుంటున్న మంచోడు'

By

Published : Dec 9, 2019, 9:16 AM IST

Updated : Dec 9, 2019, 4:29 PM IST

హీరో కల్యాణ్​రామ్-దర్శకుడు సతీశ్ వేగేశ్న​ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. తాజాగా ఈ సినిమాలోని తొలి గీతాన్ని విడుదల చేశారు. "ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో" అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. గోపీ సుందర్ బాణీలు సమకూర్చాడు​. బంధాలు, స్నేహాల గురించి ఈ పాటలో చాలా చక్కగా రాశారు.

కల్యాణ్​రామ్​ సరసన మెహరీన్​ హీరోయిన్​గా నటిస్తోంది. ఉమేశ్​ గుప్తా, సుభాశ్​ గుప్తా నిర్మాతలు. వచ్చే జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇదీ చదవండి:ప్రేమ పేరిట మోసం- కట్నం కోసం యువతి సజీవ దహన

Last Updated : Dec 9, 2019, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details