'హే జవాని హి దివాని' ఫేమ్ ఎవ్లిన్ శర్మ(Evelyn Sharma) పెళ్లి పీటలెక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్ డాక్టర్ తుషాన్ భిండి(Tushaan Bhindi)ని మే 15న వివాహమాడినట్లు ఆమె సోమవారం వెల్లడించింది. వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా.. పలువురు అభిమానులు ఎవ్లిన్కు శుభాకాంక్షలు తెలిపారు.
వివాహబంధంలో అడుగుపెట్టిన 'సాహో' భామ - ఎవ్లిన్ శర్మ సాహో
బాలీవుడ్ నటి ఎవ్లిన్ శర్మ(Evelyn Sharma) పెళ్లి పీటలెక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్ డాక్టర్ తుషాన్ భిండి(Tushaan Bhindi)ని ప్రేమించి గతనెలలో వివాహమాడింది. ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఎవ్లిన్.. తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది.
![వివాహబంధంలో అడుగుపెట్టిన 'సాహో' భామ Yeh Jawaani Hai Deewani star Evelyn Sharma ties the knot with Tushaan Bhindi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12044619-567-12044619-1623047196887.jpg)
వివాహబంధంలో అడుగుపెట్టిన 'సాహో' భామ
అయితే 2019లోనే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. 'ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్'(From Sydney with Love) అనే చిత్రంతో ఎవ్లిన్ శర్మ బాలీవుడ్లో అడుగుపెట్టింది. రణ్బీర్ కపూర్ నటించిన 'హే జవాని హి దివాని'(hey jawani he diwani) చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సాహో'(Sahoo) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఎవ్లిన్ శర్మ ప్రస్తుతం 'ఎక్స్ రే: ది ఇన్నర్ ఇమేజ్' సినిమాలో నటిస్తోంది.
ఇదీ చూడండి:'సాహో' నటికి పెళ్లి కుదిరింది