యశ్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో 'కేజీయఫ్' సీక్వెల్(KGF Sequel)గా తెరకెక్కుతున్న చిత్రం 'కేజీయఫ్ 2'. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జులై 16న తెరపైకి రావాల్సిన ఈ సినిమా వాయిదా(KGF release postponed) పడింది. అయితే దేశవ్యాప్తంగా సినిమాహాళ్లు తెరిచిన(Theaters Reopen) వెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే కన్నడ వెర్షన్ డబ్బింగ్ పూర్తయిందని చిత్రబృందం తెలిపింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి బ్రసూర్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.