తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Yash: కొత్త ఇంట్లో అడుగుపెట్టిన యశ్​ - Yash new home

కన్నడ స్టార్ హీరో యశ్(Yash) కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

yash
యశ్

By

Published : Jul 2, 2021, 2:05 PM IST

కన్నడ స్టార్‌ హీరో యశ్(Yash) కొత్తింటిలో అడుగుపెట్టాడు. బెంగళూరులోని అత్యంత ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్స్‌లో యశ్‌ ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఈ మేరకు యశ్‌-రాధికా పండిట్‌ దంపతులు గురువారం ఉదయం నూతన గృహంలోకి అడుగుపెట్టారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

భార్యతో యశ్

ఈ నూతన గృహప్రవేశ వేడుకలో యశ్‌ తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబసభ్యులు, అత్యంత ఆప్తులు మాత్రమే పాల్గొన్నారు. తమ అభిరుచులకు అద్దం పట్టేలా యశ్‌-రాధిక ఈ ఇంటిని డిజైన్‌ చేయించుకోనున్నారు.

భార్యతో యశ్

యశ్‌ ప్రస్తుతం 'కేజీఎఫ్‌-2' (KGF 2)రిలీజ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన రాఖీబాయ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. రవీనా టాండన్‌, రావు రమేష్‌, ప్రకాశ్‌రాజ్‌ ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు.

భార్యతో యశ్

ఇవీ చూడండి: యెల్లో డ్రెస్​లో మెరిసిపోతోన్న టాలీవుడ్ బ్యూటీస్!

ABOUT THE AUTHOR

...view details