కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కథానాయిక యామీ గౌతమ్(Yami Gautam) నుంచి ఓ కొత్త చిత్రం రానుంది. అనిరుద్ధా రాయ్ చౌధురి దర్శకత్వంలో ఆమె నటించనున్న చిత్రం 'లాస్ట్'(Yami Gautam Lost). కోల్‌కతా నేపథ్యంలో క్రైమ్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ తెరకెక్కనున్న ఈ చిత్రంలో యామీ క్రైమ్ రిపోర్టర్‌గా నటించనుంది.
Yami Gautam: క్రైమ్ రిపోర్టర్‌గా యామీ - Yami Gautam Lost
బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్(Yami Gautam) ఓ క్రైమ్, ఎమోషనల్ థ్రిల్లర్‌లో నటించేందుకు సిద్ధమైంది. 'లాస్ట్'(Yami Gautam Lost) టైటిల్‌గా ఖరారు చేసిన ఈ చిత్రంలో యామీ ఓ క్రైమ్ రిపోర్టర్ పాత్ర పోషించనుంది.
![Yami Gautam: క్రైమ్ రిపోర్టర్‌గా యామీ Yami Gautam to play feisty crime reporter in Lost](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12441625-852-12441625-1626153506316.jpg)
Yami Gautam: క్రైమ్ రిపోర్టర్‌గా యామీ
దర్శకుడు అనిరుద్ధా రాయ్(Aniruddha Roy Chowdhury) మాట్లాడుతూ.. "నేను ఏ సినిమా తీసినా సామాజిక సందేశం ఉంటుంది. 'లాస్ట్' అంతకుమించి ఉంటుంది" అని చెప్పారు. మరోవైపు యామీ నటించిన 'భూత్ పోలీస్' విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇదీ చూడండి..'నారప్ప', 'దృశ్యం2' ఓటీటీ డీల్ ఎంతంటే?