నేచురల్‌స్టార్ నాని.. ప్రముఖ వ్యాఖ్యాత సుమను సరదాగా ఆటపట్టించారు. 'సుమ ఆంటీ' అంటూ పిలిచారు. ఆమె వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న 'క్యాష్' షోలో తాజాగా 'టక్ జగదీశ్' చిత్రబృందం సందడి చేసింది.
క్యాష్: సుమపై నాని పంచ్‌లు.. నవ్వులే నవ్వులు! - tuck jagadish nani
సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'క్యాష్' షోకు నాని 'టక్ జగదీశ్' చిత్రబృందం అతిథులుగా విచ్చేసింది. ఇందులో హీరో నాని.. సుమపై పంచ్‌లు వేస్తూ షో మొత్తం నవ్వులు పూయించారు. ఈ కార్యక్రమం నేడు రాత్రి ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటివరకు దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..
నటీనటులు నాని-రీతూవర్శతోపాటు చిత్రదర్శకుడు శివ నిర్వాణ ఈ షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సుమ మాట్లాడుతూ.. 'అమ్మాయిలకు ఆంటీ అని పిలిస్తే నచ్చదు' అని అంటే నాని ఆమెను ఆటపట్టించారు. 'ఈరోజు సుమ ఆంటీ షోకి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. సుమ ఆంటీకి నేను వీరాభిమానిని. సుమ ఆంటీ అంటే నాకెంతో ఇష్టం' అని సరదాగా అన్నారు. అలాగే.. 'ఆంటీ అని ఇకపై పిలవనని కేవలం సుమ పిన్ని అంటాను' అని వరుస పంచులు వేశారు. కాగా, సుమ-శివ నిర్వాణల సరదా సెటైర్లతో క్యాష్ షో ఆద్యంతం జోష్‌ఫుల్‌గా మారింది. ఇలాంటి ఎన్నో సరదా విశేషాలతో సాగిన ఈ పూర్తి ఎపిసోడ్ నేడు రాత్రి 9.30గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటివరకూ దీనికి సంబంధించిన ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి..