బాలీవుడ్లో విభిన్న పాత్రలను పోషించి.. తన నటన, అభినయంతో ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని కలలు కన్న ఈ ముద్దుగుమ్మ.. ముఖానికి రంగేసుకొని చిత్రపరిశ్రమలోకి వచ్చింది. అంతేకాదు సినీ కెరీర్లో 20 వసంతాలనూ పూర్తి చేసుకుంది.
తాజాగా ఈ అరుదైన మైలురాయికి గుర్తుగా తన ప్రణాళికలను వెల్లడించింది ప్రియాంక. ఈ 20 ఏళ్ల తన ప్రయాణంలో భాగంగా 20 మధుర స్మృతులను సామాజిక మాధ్యమాల్లో పంచుకోనున్నట్లు తెలిపింది. వర్చువల్ వేడుకలో తనతో కలిసి పాల్గొనాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చింది.