తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2021, 11:44 AM IST

ETV Bharat / sitara

మహేశ్​ చేతుల మీదుగా టీజర్​.. 'కబ్జా'లో సుదీప్​

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చాయి. అందులో 'డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ' టీజర్​తో పాటు 'కబ్జా', 'నారప్ప', 'లక్ష్య', 'చక్ర', 'కనబడుటలేదు' చిత్రాల సంక్రాంతి పోస్టర్లు ఉన్నాయి.

WWW movie teaser launched by Superstar mahesh
మహేశ్​ చేతుల మీదుగా టీజర్​.. 'కబ్జా'లో సుదీప్​

  • సూపర్​స్టార్ మహేశ్​బాబు చేతుల మీదుగా గురువారం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో అదిత్, శివాత్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కేవీ గుహన్ దర్శకుడు.
  • విలక్షణ నటుడు ఉపేంద్ర ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'కబ్జా'. ఇందులోని ఓ కీలకపాత్ర కోసం కిచ్చా సుదీప్​ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. 1947 నుంచి 1986 మధ్య మాఫియాను రూపుమాపడానికి ప్రయత్నించిన భార్గవ్​ భక్షీ పాత్రలో ఆయన నటించనున్నట్లు వెల్లడించింది.
    'కబ్జా' సినిమాలో కిచ్చా సుదీప్​
  • విక్టరీ వెంకటేశ్​, ప్రియమణి ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నారప్ప'. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్రబృందం పోస్టర్​ విడుదల చేసింది.
    'నారప్ప' సినిమా పోస్టర్​
  • నాగశౌర్య, షెర్లీ సెటియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం 'లక్ష్య'. ఇందులో శౌర్య.. ఆర్చరీ క్రీడాకారుడిగా ఎనిమిది పలకల దేహంతో కనిపించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర పోస్టర్​ను విడుదల చేశారు.
    'లక్ష్య' సినిమాలో నాగశౌర్య, షెర్లీ సెటియా
    'చక్ర' సినిమాలో విశాల్​
    'కెనడి క్లబ్​' సినిమా పోస్టర్​
    'కనబడుటలేదు' సినిమాలో సునీల్​

ABOUT THE AUTHOR

...view details