తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫైట్​లు కాదు.. ఫన్నీ చేయనున్నాడు బిగ్​ షో - netflix

నెట్​ఫ్లిక్స్ కామెడీ సిరీస్​లో నటించనున్నాడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బిగ్​ షో. 'ద బిగ్ షో షో' పేరుతో హాస్య ప్రధానంగా రూపుదిద్దుకుంటోంది. ఆగస్టు 9న ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది.

బిగ్ షో

By

Published : Aug 1, 2019, 12:06 PM IST

పాల్​ వైట్​ అంటే ఎవరికి తెలియకపోవచ్చు. అదే బిగ్ షో అని పిలిస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు చాలామంది. డబ్ల్యూడబ్ల్యూఈ చూసే వారికి ఈ పేరు సుపరిచితమే. అయితే ఈ ప్రొఫెషనల్ రెజ్లర్ నెట్​ఫ్లిక్స్ కామెడీ సిరీస్​లో నటించనున్నాడు.

'ద బిగ్​ షో షో' అనే పేరుతో డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. టీనేజి కూతురు తమ కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు జరిగే సంఘటనలను హాస్య ప్రధానంగా చూపించనున్నారు. ఈ సిరీస్​ పది ఎపిసోడ్​లు ఉండనున్నట్టు సమాచారం.

ఇప్పటికే చాలా హాలీవుడ్ సినిమాల్లో అతిథి పాత్రల్లో తళుక్కున మెరిశాడు బిగ్​ షో. ఇప్పుడు రాబోతున్న నెట్​ఫ్లిక్స్ సిరీస్​లో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఆలిసన్ మున్, రెలైన్ క్యాస్టర్, జూలియట్ డోన్​ఫీల్డ్​ తదితరులు ఇందులో భాగం కానున్నారు. ఆగస్టు 9 నుంచి ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇది చదవండి: భారతీయుడు 2 చిత్రంలో పాల్గొననున్న కమల్!

ABOUT THE AUTHOR

...view details