తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"ఆర్ఆర్ఆర్' ఫైట్స్ చూసి భావోద్వేగం చెందుతారు' - తారక్ గురించి విజయేంద్ర ప్రసాద్

'ఆర్ఆర్ఆర్' పోరాట సన్నివేశాలు చూసి ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారని తెలిపారు చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని వెల్లడించారు.

Vijayendra Prasad
విజయేంద్ర ప్రసాద్

By

Published : May 26, 2021, 1:04 PM IST

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని ఫైట్‌ సీక్వెన్స్‌కి కూడా ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారని చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆర్ఆర్‌ఆర్‌', తారక్‌ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ స్థాయిని తారక్‌ సొంతం చేసుకుంటాడని 'స్టూడెంట్ నెం.1' సమయంలోనే తనకు అనిపించిందని తెలిపారు. అలాగే 'భజరంగీ భాయీజాన్' లాంటి ఎమోషనల్‌, సెంటిమెంటల్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ నటిస్తే చూడాలనుకుంటున్నట్లు చెప్పారు.

"మన సినిమా గురించి మనం గొప్పగా చెప్పుకోవడం సభ్యత కాదు. కానీ, 'ఆర్‌ఆర్‌ఆర్‌' గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. మామూలుగా ఏదైనా సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ వస్తే.. ఈలలు వేయడం మనం చేస్తుంటాం. కానీ మొదటసారి 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. ఎంతో బాధగా అనిపించింది. ప్రేక్షకులు కూడా తప్పకుండా అదే అనుభావాన్ని పొందుతారని పక్కాగా చెప్పగలను. ఫైట్‌ సీక్వెన్స్‌కి కూడా ప్రేక్షకులు భావోద్వేగాన్ని ఫీల్‌ అవుతారు" అని విజయేంద్రప్రసాద్‌ వివరించారు.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. యాక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో తారక్‌ కొమురం భీమ్‌గా, చెర్రీ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details