శివుడిని వేడుతూ రామజోగయ్య శాస్త్రి కరోనాపై పాట - రామజోగయ్య శాస్త్రి కరోనాపై పాట
శివయ్యను వేడుకుంటూ కరోనాపై పాట రూపొందించారు గేయరచయిత రామజోగయ్యశాస్త్రి. మానవాళిపై జాలి చూపించమని పరమశివుడ్ని ప్రార్థించారు.
హద్దులు మీరి ప్రవర్తించే మనిషి మీద శివయ్యకు కోపం రావడం సహజమేనని, అయితే ఈసారి మన్నించమని పరమశివుడ్ని వేడుకున్నారు సినీ గేయరచయిత రామజోగయ్య శాస్త్రి. కరోనా నేపథ్యంలో శివుడిపై ప్రత్యేక పాటను ఆయన రూపొందించారు. 'సీశైల మల్లయ్య మా భూగోళం మంచిగా లేదయ్యా' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి కడుపు కోతలు చూసైనా మానవాళి మీద జాలి చూపించమని శివుడిని తన పాటలో ప్రార్థించారు రామజోగయ్య. పణి నారాయణ ఈ గీతాన్ని ఆలపించగా, నేపథ్యంలో వచ్చే శివుడి చిత్రపటాలను మరో రచయిత లక్ష్మీభూపాల్ గీశారు.