పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. 'వకీల్‌సాబ్'లోని తన పాత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను చిత్రబృందం ట్విట్టర్లో పంచుకుంది. పోరాటంతో చిత్రీకరణను ముగించినట్లు పవన్ చొక్కా చూస్తే తెలుస్తోంది.
ఫైట్‌తో 'వకీల్‌సాబ్'ను పూర్తి చేసిన పవన్ - vakeelsaab pink cinema
'వకీల్‌సాబ్'లోని తన పాత్ర చిత్రీకరణను పవన్ పూర్తి చేశారు. ఇందులో ఆయన న్యాయవాదిగా నటిస్తున్నారు.
పవన్‌కల్యాణ్ వకీల్‌సాబ్
బాలీవుడ్ హిట్ 'పింక్' రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ న్యాయవాదిగా నటిస్తున్నారు. శ్రుతి హాసన్ ఆయనకు జోడీగా చేస్తోంది. అంజలి, నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్లలో సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారు.