హీరోయిన్ కరిష్మా కపూర్‌ను కాపీ కొట్టేంత ధైర్యం తనకు లేదని యువ నటి సారా అలీఖాన్ చెప్పింది. 'కూలీ నెం.1'లో ఒక్కసారి కూడా ఆమెలా నటించేందుకు ప్రయత్నించలేదని, తాను సొంతంగా నటించానని తెలిపింది.
'ఆమెను కాపీ కొట్టేంత ధైర్యం లేదు' - కూలీ నం.1 రీమేక్ వరుణ్ ధావన్ సారా అలీ ఖాన్
'కూలీ నెం.1' విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో హీరోయిన్ సారా అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎవర్నీ కాపీ కొట్టి ఇందులో నటించలేదని తెలిపింది.
ఆమెను కాపీ కొట్టేంత ధైర్యం లేదు: సారా అలీఖాన్
'కూలీ నెం,1' ఒరిజినల్లో గోవిందా, కరిష్మా కలిసి నటించగా, రీమేక్‌లో వరుణ్ ధావన్ - సారా హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈనెల 25న అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. రెండింటికి డేవిడ్ ధావనే దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి: