బాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురి క్రీడాకారుల జీవితాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకులు, నటీనటులు సూపర్ హిట్లు అందుకోవడమే కాదు, మంచి పేరు కూడా సంపాదించారు. ఇదే తరహాలో... ఇప్పుడు చెస్ గ్రాండ్ మాస్టర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జీవిత చరిత్ర(Viswanathan anand biography) కూడా తెరకెక్కనుంది. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని స్వయంగా ఆనంద్ ప్రకటించారు. ఇందులో తన పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir khan viswanathan anand movie) నటిస్తే బాగుంటుందని ఆయన చెప్పారు.
"సినిమాలో నా పాత్రలో ఎవరు నటిస్తారో చెప్పలేను. కానీ, నేనైతే ఆమిర్ ఖాన్(Aamir khan viswanathan anand movie) ఆ పాత్రను పోషిస్తే బాగుంటుందని చెప్పగలను. ఆమిర్‌కు, నాకు చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయని నేను భావిస్తాను."
-విశ్వనాథన్ ఆనంద్, చెస్ గ్రాండ్ మాస్టర్.