కథానాయకుల విషయంలో అభిమానుల మధ్య కోల్డ్ వార్స్ ఉంటాయేమో కానీ, కథానాయికల విషయంలో ఇది అరుదుగానే కనిపిస్తుంటుంది. ఎందుకంటే అందచందాలతో అలరించే ఏ తళుకు తారనైనా భద్రంగా మదిలో దాచేసుకుంటారు సినీప్రియులు. ప్రాంతీయ, భాషా భేదభిప్రాయాలు పక్కకు నెట్టి మరీ ఆ సొగసుల చిన్నదాన్ని తమ హృదయపు కోవెలలో కలల రాణిలా కొలువు దీర్చుకుని మురిసిపోతుంటారు. దశాబ్దంన్నరకు పైగా వెండితెరపై వెలుగులు చిందిస్తున్న కాజల్ అగర్వాల్‌కూ ఇలాంటి గొప్ప అభిమాన గణమే ఉంది.
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో నిత్యం కాజల్‌ను అనుసరించేవాళ్లు మిలియన్ల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు వీళ్లందరూ కలిసి డిసెంబరు 20వ తేదీని 'వరల్డ్ కాజలిజం డే'గా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్‌తో అటు ఇన్‌స్టాగ్రామ్, ఇటు ట్విట్టర్లో వేలాదిగా పోస్ట్‌లు వచ్చి పడుతున్నాయి. అంతేకాదు ఈరోజును పురస్కరించుకుని కాజల్ ఫొటోతో ఓ కామన్ డీపీని కూడా రెడీ చేసుకున్నారు. కొన్ని చోట్లయితే ఏకంగా ఈ చందమామ పేరు మీదుగా అన్నదానాలు, పాలాభిషేకాలు వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ 'కాజలిజం డే' సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది.
ఈరోజే ఎందుకంటే..!