అప్పుడు గీతతో.. ఇప్పుడు సువర్ణతో.. ఇది యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు సంబంధించింది. కొన్ని సినిమాల్లోని పలు హావభావాలు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. 'గీత గోవిందం'లో కథానాయిక రష్మికను పెళ్లి చేసుకున్నట్లు విజయ్ ఊహించుకునే సన్నివేశంలో వచ్చే కొన్ని మూమెంట్స్ యువతను అమితంగా అలరించాయి. ప్రతి అమ్మాయి విజయ్ లాంటి భర్త రావాలని, ప్రతి అబ్బాయి రష్మికలాంటి భార్య కావాలని కోరుకున్నారంటే అతిశయోక్తి కాదు.
అప్పుడు గీతతో.. ఇప్పుడు సువర్ణతో - వరల్డ్ ఫేమస్ లవర్
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమాలోని ఓ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం.
విజయ్
ఆ సినిమాలో గీత పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. అదే తరహాలో ఇప్పుడు ఐశ్వర్యా రాజేష్ ఆకట్టుకోబోతుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్ నటిస్తున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. తాజాగా ఈ చిత్రంలోని ఓ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సీనయ్యగా విజయ్, సువర్ణగా ఐశ్వర్యా రాజేశ్ జోడీ కనువిందు చేస్తోంది.
ఇవీ చూడండి.. 'చిన్నప్పటి నుంచే భాషపై అభిరుచిని పెంచుకోవాలి'