తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వరల్డ్ ఫేమస్ లవర్​.. దేవరకొండ లుక్స్ ఇదిగో - తెలుగు సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమాలోని నాలుగో పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

world famous lover
విజయ్ దేవరకొండ

By

Published : Dec 15, 2019, 7:05 PM IST

క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తోన్న చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లె, కేథరీన్, రాశీ ఖన్నా హీరోయిన్లు. తాజాగా ఈ సినిమాలోని నాలుగో పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. విజయ్​.. హీరోయిన్​ రాశీ ఖన్నాతో కలిసి ఉన్న ఫొటో నెట్టింట హల్​చల్ చేస్తోంది.

రాశీ ఖన్నా, విజయ్ దేవరకొండ

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ చిత్ర ప్రమోషన్స్​ను ప్రారంభించింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఈ సినిమాలోని హీరోయిన్ల పాత్రలతో పాటు విజయ్ దేవరకొండ లుక్స్​ను ఒక్కొక్కటిగా విడుదల చేసింది. ఈ మూవీలో దేవరకొండ నాలుగు పాత్రల్లో కనిపించనున్నాడు. జనవరి 3న టీజర్ విడుదల కానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇజబెల్లె, విజయ్ దేవరకొండ
కేథరిన్, విజయ్ దేవరకొండ
ఐశ్వర్యా రాజేశ్, విజయ్ దేవరకొండ

ఇవీ చూడండి.. 'వెంకీమామ' దర్శకుడి చూపు బన్నీ వైపు

ABOUT THE AUTHOR

...view details