తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వాలంటైన్స్​ డే' కానుకగా విజయ్ కొత్త సినిమా!

విజయ్ దేవరకొండ నటిస్తున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' వచ్చే వాలంటైన్స్​ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

By

Published : Nov 24, 2019, 10:58 AM IST

విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ.. 'డియర్​ కామ్రేడ్'​తో ఈ ఏడాది వెండితెరపై సందడి చేశాడు. ప్రస్తుతం 'వరల్డ్​ ఫేమస్​ లవర్​' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే వాలంటైన్స్​ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిన అవసరముంది.

'వరల్డ్ ఫేమస్ లవర్'లో విజయ్ దేవరకొండ

ఈ సినిమా చివరి షెడ్యూల్​తో పాటు, నిర్మాణనంతర కార్యక్రమాలను ఏక కాలంలో పూర్తి చేయనున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్​లుక్​ ఆకట్టుకుంటోంది. ఇందులో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్, ఇస్​బెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకుడు. కె.ఏ.వల్లభ నిర్మిస్తున్నారు.

ఇదే కాకుండా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్​' అనే సినిమాలోనూ విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.

ఇది చదవండి: 'డియర్ కామ్రేడ్​'తో విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు కష్టాలు!

ABOUT THE AUTHOR

...view details