'వరల్డ్ ఫేమస్ లవర్'తో సెంచరీ కొట్టిన విజయ్ - vijay devarakonda news
విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా హిందీ వెర్షన్ నెటిజన్లను విశేషంగా అలరిస్తోంది. యూట్యూబ్లో సరికొత్త ఘనతలు సాధిస్తోంది!
'వరల్డ్ ఫేమస్ లవర్'తో సెంచరీ కొట్టిన విజయ్
టాలీవుడ్లో అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన 'వరల్డ్ ఫేమస్ లవర్'.. హిందీ వెర్షన్లో దుమ్మురేపుతోంది. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన నెల రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ సాధించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో విజయ్ సరసన రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్, ఇస్బెల్లా హీరోయిన్లుగా నటించారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు.