రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. 'వరల్డ్ ఫేమస్ లవర్'కు సంబంధించిన హీరోయిన్లు లుక్‌లు విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. గురవారం నుంచి వరుసగా నాలుగు రోజులు పాటు వారి ఫస్ట్‌లుక్‌లు అభిమానులతో పంచుకోనుంది. (12-ఐశ్వర్య రాజేశ్, 13-ఇస్బెల్లా, 14-కేథరిన్, 15-రాశీఖన్నా)
నాలుగు రోజులు.. నలుగురు లవర్స్ - WORLD FAMOUS LOVER FIRST LOOKS
'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో హీరోయిన్ల ఫస్ట్‌లుక్‌లు రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు పాటు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ.
హీరో విజయ్ దేవరకొండ
ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకుడు. కె.ఏ వల్లభ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'ఫైటర్'తో రౌడీహీరో బాలీవుడ్ ఎంట్రీ!
Last Updated : Dec 11, 2019, 7:43 PM IST