తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్యాన్సర్​ను జయించిన 'సినీ' రియల్​ హీరోలు - తాహిరా కశ్యప్ వార్తలు

ప్రాణాంతక క్యాన్సర్​ను జయించిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు.. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గురువారం(ఫిబ్రవరి 4) ఇంటర్నేషనల్ క్యాన్సర్​ డే సందర్భంగా వారి పోరాటాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. ఇంతకీ క్యాన్సర్​ను జయించిన ఆ స్టార్స్ ఎవరంటే?

World Cancer Day: Celebs who won the battle against this deadly disease
క్యాన్సర్ డే: ​ప్రాణాంతక వ్యాధిని జయించిన సినీ ప్రముఖులు

By

Published : Feb 4, 2021, 4:24 PM IST

Updated : Feb 4, 2021, 4:30 PM IST

ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్​ డే నిర్వహిస్తారు. ఈ ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం సహా దానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని ఈ రోజు గుర్తు చేసుకుంటారు. అయితే బాలీవుడ్​లో చాలామంది స్టార్స్.. క్యానర్​ బారిన పడి, దానిని జయించారు. ఇతరుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. క్యాన్సర్​ దినోత్సవం సందర్భంగా వారి గురించి ఓసారి తెలుసుకుందాం.

సంజయ్​ దత్​

సంజయ్​ దత్​

ఊపిరితిత్తుల క్యాన్సర్​తో తాను బాధపడుతున్నట్లు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గతేడాది వెల్లడించారు. లాక్​డౌన్ తర్వాత చికిత్స కోసం విదేశాలకూ వెళ్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సినిమాలకు కొన్ని నెలలు విరామం తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే అదే ఏడాది అక్టోబరులో క్యాన్సర్​ను జయించానని ఆయన ప్రకటించడం విశేషం.

మనీషా కొయిరాలా

మనీషా కొయిరాల

2012లో అండాశయ క్యాన్సర్​ బారిన పడిన నటి మనీషా కొయిరాలా.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు విరామాన్ని ప్రకటించింది. వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సమయంలో 'హీల్డ్​' పుస్తకాన్ని రాసింది. క్యాన్సర్​పై ఆమె చేసిన పోరాటాన్ని అందులో పొందుపర్చింది. అనంతరం కొన్నాళ్లకు క్యాన్సర్​ నుంచి పూర్తి కోలుకుని.. 'డియర్​ మాయ'(2017) చిత్రంతో పునరాగమనం చేసింది మనీషా.

సోనాలీ బింద్రే

క్యాన్సర్​తో చేసిన పోరాటంలో నటి సోనాలీ బింద్రే అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆమె.. చికిత్స కోసం న్యూయార్క్​ వెళ్లింది. అలాంటి క్లిష్ట సమయంలోనూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ.. తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంది. ఓ సందర్భంలో తన వెంట్రుకలన్నీ రాలిపోతూ బట్టతల వచ్చేలా ఉందని పోస్ట్​ కూడా చేసింది. తాను క్యాన్సర్​పై చేస్తున్న పోరాటాన్ని ఓ నోట్​ ద్వారా పంచుకుంది.

సోనాలీ బింద్రే

"గత రెండు నెలలుగా, నా జీవితంలో మంచి, చెడు రోజులు కలిసి వచ్చాయి. నేను చాలా అలసిపోయిన, బాధతో ఉన్న రోజులు అందులో ఉన్నాయి. చేతి వేలు లేపడానికి కూడా చాలా బాధగా అనిపించేది. ఇది ఓ చక్రంలా ఒంటి నొప్పులతో పాటు మానసిక ఆవేదనకు దారి తీసింది. అలాంటి ప్రతి క్షణాన్ని ఎదుర్కొంటూ.. క్యాన్సర్​పై నిరవధిక పోరాటం చేశాను" అని సోనాలీ బింద్రే ఆ నోట్​లో పేర్కొంది.

అనురాగ్​ బసు

'లూడో' దర్శకుడు అనురాగ్​ బసు.. రక్త క్యాన్సర్​ (లుకేమియా) బారిన పడ్డారు. ఈ వ్యాధితో చాలా బాధలు పడ్డారు. క్లిష్ట సమయంలోనూ ప్రాణాంతక వ్యాధితో ధైర్యంగా పోరాడి, క్యాన్సర్​ను జయించారు.

తాహిరా కశ్యప్​

తాహిరా కశ్యప్​

బాలీవుడ్​ హీరో ఆయుష్మాన్​ ఖురానా భార్య, చిత్రనిర్మాత తాహిరా కశ్యప్.. గతంలో​ రొమ్ము క్యాన్సర్​ బారిన పడింది. ఈ వ్యాధితో తీవ్రంగా పోరాడి.. చివరకు దానిని జయించింది. ఈ వ్యాధి గురించి ఇప్పటికీ ప్రజల్లో అవహగాన కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తోంది.

ఇదీ చూడండి:కరోనా సంక్షోభంలోనూ తరగని కోహ్లీ బ్రాండ్ వాల్యూ!

Last Updated : Feb 4, 2021, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details