కథానాయకుడు నాగచైతన్య 'ప్రేమమ్' చిత్రంలో అతిథి పాత్రతో అలరించాడు విక్టరీ వెంకటేశ్. ఇప్పుడు వీరిద్దరూ కలిసి 'వెంకీమామ' అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు అక్కినేని అబ్బాయి.
"ఆన్‌స్క్రీన్ అయినా, ఆఫ్‌స్క్రీన్ అయినా వెంకటేశ్ మామ అందరికీ నచ్చే వ్యక్తి. ఆయనతో కలిసి నటించడం, కామెడీ పండించడం చాలా కష్టం. షూటింగ్‌ను ఎంజాయ్ చేస్తూనే ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా అభిమానులను అలరిస్తుందని నా నమ్మకం". -నాగచైతన్య, హీరో
వెంకీమామ సెట్లో నాగచైతన్య, వెంకటేశ్ సందడి