డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను ఎదుర్కొన్న నటి రకుల్‌ప్రీత్ సింగ్ తిరిగి సినిమా షూటింగ్‌కు హాజరైంది. ఇటీవలే ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన రకుల్.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ పాల్గొంది. ఇందులో ఆమె వ్యవసాయం చేసే పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నారట. వైష్ణవ్ తేజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి నవల 'కొండపొలం' ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచారం ఉంది. ఈ సినిమా సెట్‌లో తీసిన వీడియోను రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. వర్షం కురుస్తున్నా షూటింగ్ ఆగలేదని చెప్పింది.
'కరోనా సరిపోదా?.. ఇంకా వర్షాలు కూడానా!' - వానలో షూటింగ్ చేస్తున్న రకుల్
ఓవైపు కరోనాతో విలవిలలాడుతుంటే.. మరోవైపు హైదరాబాద్‌లో భారీ వర్షాలు మరింత అడ్డంకిగా మారాయని అంటోంది నటి రకుల్‌ప్రీత్ సింగ్. ఇటీవలే డ్రగ్స్ కేసు విచారణలో పాల్గొన్న ఆమె.. తాజాగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది. వర్షం కురుస్తున్నా.. చిత్రీకరణ ఆగలేదంటూ సెట్లోని ఓ వీడియోను సోషల్‌మీడియాలో పంచుకుంది.
"వికారాబాద్‌లోని రాతి కొండలపై షూట్ చేస్తుండగా వర్షం మొదలైంది. వర్షం నుంచి కెమెరాలను కాపాడుకుంటున్నాం. కొవిడ్-19 సమస్యతో ఓ పక్క మనం ఇబ్బందిపడుతుంటే.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు మరో అడ్డంకిగా మారాయి" అని ఆమె వెల్లడించింది. వర్షంలోనూ చిత్ర బృందం సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ కనిపించారు.
రకుల్ 'మన్మథుడు 2'లో గతేడాది తెలుగు తెరపై కనిపించారు. ఆపై హిందీ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు దక్షిణాది చిత్రాలున్నాయి. కమల్ హాసన్ నటిస్తున్న 'భారతీయుడు 2'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో కాజల్, సిద్ధార్థ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.