తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''వండర్ ఉమన్‌' పాత్ర కాదు అదొక అద్భుతం' - మానుషి చిల్లర్ వండర్ ఉమన్ ఫొటో

మిస్ వరల్డ్​ మానుషి చిల్లర్ తాజాగా ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఓ ఫొటో షేర్ చేసింది. హాలీవుడ్ చిత్రం 'వండర్ ఉమన్​'లోని నాయిక పాత్రకి అచ్చం అలాగే ఉండే తన ఫొటోను పెట్టింది.

Manushi Chillar
మానుషి

By

Published : May 30, 2020, 9:46 PM IST

"వండర్‌ ఉమన్‌ ఒక పాత్రకాదు అదొక మహత్తరమైన శక్తి" అంటోంది బాలీవుడ్‌ నటి మానుషి చిల్లర్‌. 2016 నాటికి మానుషి చిల్లర్‌ కొద్దిమందికి మాత్రమే తెలుసు. 2017లో ఫెమినా మిస్‌ హర్యానా, ఫెమినా మిస్‌ ఇండియా తర్వాత మిస్‌ వరల్డ్​గా అందాల కెరీటం దక్కించుకుంది. ఒక్కసారిగా తన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది.

తాజాగా మానుషి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హాలీవుడ్‌ సినిమా 'వండర్‌ ఉమన్‌'లోని నాయిక పాత్రకి అచ్చం అలాగే ఉండే తన ఫొటోను పెట్టింది. ఆ ఫొటోను తనదైన రీతిలో వర్ణిస్తూ.. "నేను చేయగలిగే మనిషిని. 'వండర్‌ ఉమన్‌' కేవలం కల్పిత పాత్ర కాదు. అదొక శక్తి. మనసు ఉచ్చస్థితి. ఇలాంటి ఫొటోను పంపినందుకు స్వాప్నిల్‌ పవార్‌కి ధన్యవాదాలు. బహుశా ఈ చిత్రం సమాంతర విశ్వం నుంచి వచ్చిందేనా అనిపిస్తోంది" అని రాసుకొచ్చింది.

మానుషి ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న చారిత్రక చిత్రం 'పృథ్వీరాజ్‌'లో నటిస్తోంది. ఇందులో పృథ్వీరాజ్‌ భార్య సన్యోగిత చౌహాన్‌ అనే పాత్రలో కనిపించనుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమంలో అంతర్జాతీయ మిస్‌ వరల్డ్ ఫౌండేషన్‌ తరపున కూడా తనవంతుగా ప్రచారం చేస్తుంది చిల్లర్.

ABOUT THE AUTHOR

...view details