Women issue songs dialogues: సమాజం, ప్రపంచం అభివృద్ధి చెందుతున్నా ఇంకా.. 'వాళ్లతో మాట్లాడొద్దు.. వీళ్లతో మాట్లాడొద్దు.. ఆ పని చేయొద్దు.. ఈ పని చేయొద్దు.. అక్కడికి వెళ్లొద్దు.. ఇక్కడికి వెళ్లొద్దు..' అంటూ ఇలా ఎన్నో తరాలుగా ఎన్నో కట్టుబాట్లు, ఆచారాలు ఆడపిల్లల అభివృద్ధికి అడ్డంకిగా మారుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి పలువురు మహిళలు ఎదుగుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఇంకా చాలా మంది అతివలు ఈ కట్టుబాట్లకు బలవుతూనే ఉన్నారు. అయితే వాటిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు.. ఈ సమస్యలను ప్రతిబింబించేలా ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రజలను ఆలోచింపజేసేలా వాటిపై డైలాగ్, పాటలు కూడా ఉంటున్నాయి. వీటి ద్వారా మగువల కీర్తి, ఖ్యాతి, గొప్పతనం, వాళ్లలో ఉండే ప్రత్యేకత, వాళ్లు ఎదుర్కొనే సమస్యలు, వాళ్లు పడే బాధను వివరించారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో మహిళల అభివృద్ధికి అడ్డంకిగా మారిన కట్టుబాట్లను, వారు ఎదుర్కొనే సమస్యలను తెలిపేలా ఉన్న కొన్ని డైలాగ్స్, సాంగ్స్‌ను చూసేద్దాం..
"ఒక చోట పుడతాం, పెరుగుతాం, పెళ్లి చేసుకుంటాం, ఎక్కడికో వెళ్లిపోతాం.. అంతే కదా నువ్వైనా నేనైనా.. అమ్మాయిలు ఎందుకు వెళ్లాలి నాన్న అన్నీ వదులుకొని?.. ఈ రూల్ ఎవడు పెట్టిండో కానీ చాలా మోసం నాన్న"
-ఫిదా, సాయి పల్లవి
"కాలేజీకి వెళ్లు, వెళ్లావా పాస్ అవ్వు, అయ్యావా పెళ్లి చేసుకో, చేసుకున్నావా, పిల్లల్ని కను.. ఇదేనా లైఫ్ అంటే?... ఇంట్లో బంగారం లాంటి అమ్మాయిని పెట్టుకుని కొడుకు ఉంటే బాగుండేది అనుకోవడం ఏంటి?"
-పెళ్లి చూపులు, విజయ్ దేవరకొండ
"క్రికెట్ ఆడాలంటే సెక్సువల్ ఫేవర్ అడుగుతున్నాడు, నాన్న ఏమో పరువు అంటారు, నువ్వేమో ఫైట్ చేయమంటావ్.. నాకేం కావాలో ఎవరైనా అడిగారా"
-డియర్ కామ్రేడ్, రష్మిక
"నా ఫిగర్ 36-24-36 కాదు.. అమ్మాయి లావుగా ఉంటే రిజెక్ట్ చేస్తారా? పెళ్లి అయ్యాక లావు అయితే డివర్స్ ఇస్తారా?"
-సైజ్ జీరో, అనుష్క
"అమ్మ, నాన్నకి సినిమాలో యాక్టింగ్ ఇష్టం లేదు. సినిమాలే డర్టీనా?.. మొత్తం ప్రపంచం క్లీనా?"
-సమ్మోహనం, అదితీ రావు హైదరీ
"మగవాళ్లు అనుకో లవ్ ఫెయిల్యూర్ అయి, బయటకు వచ్చి పెళ్లి చేసుకునేదాకా మందు కొట్టి కథలు చెప్తారు, ఫ్రెండ్స్ వచ్చి ఓదారుస్తారు.. మనకి అలా కాదు కదా? లవ్ ఫెయిల్యూర్ అని రియలైజ్ అయ్యేలోపే పెళ్లి పీటల మీద ఉంటాం"
-కలర్ ఫొటో
"చంటి పిల్లాడితో రోడ్డు మీద నిలబడితే ఆదరించడానికి ఎవరు రాలేదు సరి కదా.. ఒంటరి దాన్ని కదా అని అలుసుగా చూసేవారు.. నాకు వయసు ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు.. నా జీవితం నాకు కావాలి"
-ఓ బేబీ, లక్ష్మి