రాజనాల.. అలనాటి సినిమాల్లో ప్రతినాయకుడిగా తనదైన ముద్రవేసిన వ్యక్తి. నటనలో క్రూరత్వాన్ని ప్రదర్శించి చిత్రాలను రక్తి కట్టించేవాడు. బయట కూడా ఆయన అలాగే ఉండేవాడని కొంతమంది రాజనాలను చూసి భయపడేవారట. అలాంటి సంఘటన ఓసారి జరిగిందట. తాడేపల్లిగూడెం ప్రాంతంలో వరకట్నం(1968) చిత్ర షూటింగ్కు వెళ్లారట రాజనాల. అక్కడున్న కొంతమంది మహిళలు ఆయన్ను చూసి అమ్మో రాజనాల అంటూ పారిపోయారట.
తాడేపల్లిగూడెంకు స్టార్ యాక్టర్.. మహిళల పరుగులు - varakatnam 1968
అలనాటి నటుడు రాజనాల ఓసారి షూటింగ్ కోసం తాడేపల్లిగూడెం వెళ్లారట. అప్పుడు అక్కడున్న కొంతమంది మహిళలు ఆయనను చూసి అక్కడ నుంచి పారిపోయారట.
తాడేపల్లిగూడెంకు స్టార్ యాక్టర్... మహిళల పరుగులు
వారి అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నారట రాజనాల. పక్కనే హీరోయిన్ కృష్ణకుమారితో ఆ విషయాన్ని చెబుతూ.. "చూశావా కృష్ణా! విలన్ వేశాలు వేసేవాడు బయట కూడా అలాగే ప్రవర్తిస్తుంటాడని అనుకుంటున్నారు. అందుకే ఆ మహిళలు పారిపోయారు" అని ఆమెతో చెప్పారట రాజనాల. హీరోలకు ఉన్నంతమంది కాకపోయినా తమకూ అభిమానులున్నారని తెలిపారట.
ఇదీ చదవండి: 'నో ఎగ్జిట్' అంటున్న తారకరత్న, ప్రిన్స్..