తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టాప్​గన్' సీక్వెల్​తో టాప్​ లేపుతున్న టామ్​క్రూజ్​! - topgun mavrick

హాలీవుడ్ హీరో టామ్​క్రూజ్ నటిస్తున్న చిత్రం 'టాప్​గన్ మ్యావ్​రిక్'. 1986లో వచ్చిన 'టాప్​గన్' సినిమాకు సీక్వెల్​గా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

టామ్ క్రూజ్

By

Published : Jul 20, 2019, 2:17 PM IST

హాలీవుడ్​లో సాధారణ హీరోగా ఉన్న టామ్ క్రూజ్​ను యాక్షన్ స్టార్​గా మార్చిన చిత్రం 'టాప్​గన్'. 1986లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్​ రాబోతుంది. 'టాప్​గన్: మ్యావ్​రిక్'​ పేరుతో 2020 జూన్​ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉత్కంఠ గొలిపే సన్నివేశాలతో, ఊపిరిసలుపుకోని జెట్ యాక్షన్ ఘట్టాలతో ఆకట్టుకుంటోంది ప్రచారచిత్రం. ముఖ్యంగా బైక్​ నడుపుతూ.. జెట్ విమానంతో పోటీపడే సీన్​లో టామ్​ అదరగొట్టేశాడు.

అమెరికా శాండియాగోలోని కామిక్ కాన్ ఫెస్టివల్​లో ఈ ట్రైలర్​ను లాంచ్ చేశాడు టామ్ క్రూజ్.

"అమెరికా నేవీ పైలట్ల జీవితం ఆధారంగా 'టాప్​గన్' తెరకెక్కింది. అదే తరహాలో సీక్వెల్​ ఉండనుంది. అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం ఖాయం." -టామ్ క్రూజ్, హాలీవుడ్ హీరో

జోసెఫ్ కొజిన్​స్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్కై డ్యాన్స్ మీడియాతో పాటు తదితర సంస్థలు నిర్మిస్తున్నాయి.

ఇది చదవండి: ముద్దు సీన్​తో అర్జున్ రెడ్డి 2.0కు ముగింపు

ABOUT THE AUTHOR

...view details