సినీనటుడు రాజశేఖర్.. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. తన తండ్రి ఆరోగ్యంపై శివాత్మిక చేసిన ట్వీట్ చూసి స్పందించిన చిరు... తన సహచర నటుడు, స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబమంతా మనోధైర్యంతో ఉండాలని శివాత్మికకు ఆయన ధైర్యం చెప్పారు.
హీరో రాజశేఖర్ కోలుకోవాలని చిరు ట్వీట్ - చిరు ట్వీట్
టాలీవుడ్ కథానాయకుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తన కుమార్తె శివాత్మిక చేసిన ట్వీట్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన సహచర నటుడు, స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
కరోనా నుంచి రాజశేఖర్ త్వరగా కోలుకోవాలి: చిరంజీవి
ప్రస్తుతం రాజశేఖర్ హైదరాబాద్ లోని న్యూరో సిటీ సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ బారినపడిన రాజశేఖర్ కుటుంబంలో జీవిత సహా ఇద్దరు పిల్లలు శివానీ, శివాత్మిక కోలుకోగా... హీరో రాజశేఖర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.