తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేమపక్షులు: రజనీ, లత పరిణయానికి 39 ఏళ్లు

తమిళ సూపర్​స్టార్​ రజనీకాంత్, లతను ప్రేమించి పెళ్లి చేసుకుని.. సరిగ్గా నేటికి 39 ఏళ్లు పూర్తయ్యాయి. నేడు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తలైవా కుమార్తె సౌందర్య రజనీ అలనాటి ఫొటోను షేర్​ చేస్తూ ప్రేమను వ్యక్తం చేసింది.

By

Published : Feb 26, 2020, 3:28 PM IST

Updated : Mar 2, 2020, 3:35 PM IST

Rajinikanth wedding aniversary
ప్రేమపక్షులు: రజనీ కాంత్​, లత పరిణయానికి 39 ఏళ్లు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, లత పెళ్లిరోజు నేడు. వీరిద్దరి వైవాహిక జీవితానికి ఈ రోజుతో 39 ఏళ్లు నిండాయి. అయితే ఈ జంట ప్రేమించి పెళ్లిచేసుకున్నారన్న విషయం కొంతమందికే తెలుసు. తాజాగా వారి ప్రేమను గుర్తు చేసుకుంటూ అలనాటి ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది తలైవా కూతురు సౌందర్య. ఆమెతో పాటు అభిమానులు పెద్ద ఎత్తును శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

హీరో రజనీ-రిపోర్టర్​ లత...

1980లో తలైవా స్టార్​ హీరోగా రాణిస్తున్న సమయంలో లత అతడిని కలిశారు. అప్పుడు రజనీ 'గోల్‌మాల్‌'కు రీమేక్‌గా తీస్తున్న 'తిల్లు ముల్లు' సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. పాత్రికేయురాలైన లత.. రజనీని ఇంటర్వ్యూ చేయడానికి సెట్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా తలైవా తన అభిరుచులు, అభిప్రాయాలను ఆమెతో పంచుకున్నాడు. అనుకోకుండా ఇద్దరి ఆలోచనలు, ఇష్టాలు కలిశాయట. జీవిత భాగస్వామి దొరికారనుకుని, ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ శుభవార్తను రజనీ ఆ తర్వాత సెట్‌లోని తన సహనటులతో పంచుకున్నారు.

లత, రజనీ కాంత్​

లతను ఇష్టపడ్డ తర్వాత రజనీ స్వయంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడారట. వారు సమ్మతించడం వల్ల తిరుపతిలో ఇద్దరి పెళ్లి జరిగింది. రజనీ స్నేహితుడు వై.జి. మహేంద్రన్‌.. లత సోదరిని అప్పటికే వివాహం చేసుకొని ఉండటం వల్ల తలైవాకు అత్తమామల్ని ఒప్పించడం సులభమైంది. రజనీకాంత్-లత దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్దకూతురు పేరు ఐశ్వర్య. తమిళ నటుడు ధనుష్​ను ప్రేమ వివాహం చేసుకుంది. రజనీ చిన్న కూతురు సౌందర్య.. ఓ ఫార్మా కంపెనీ యజమాని విషగన్​ వనగమూడిని ఇటీవలె రెండో పెళ్లి చేసుకుంది.

లత, రజనీ అలనాటి జ్ఞాపకాలు

దర్బార్​ తర్వాత ఇదే...

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'దర్బార్‌' తర్వాత 168వ సినిమాకు సంతకం చేశాడు. శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్‌, సూరి ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు.

Last Updated : Mar 2, 2020, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details