లాక్డౌన్లో వేల మంది పేద ప్రజలకు అండగా నిలిచారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఇప్పటికీ సాయం కోరిన వారిని ఆదుకుంటూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. తాజాగా తనను సాయం కోరుతూ పోస్ట్ ద్వారా వచ్చిన ఉత్తరాలకు సంబంధించిన ఫొటోను నెట్టింట్లో పోస్ట్ చేశారాయన. ఇందులో వేల సంఖ్యలో లేఖలు నేలపై పడి కనిపిస్తున్నాయి.
'అసాధ్యమైనా.. చేయగలను అనుకుంటున్నా' - సోనూ ఇంటికి వందల ఉత్తరాలు
తనను సాయం కోరుతూ పోస్ట్ ద్వారా వచ్చిన ఉత్తరాలకు సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్. ఏదో ఒకరోజు తప్పకుండా ఈ లేఖల సంఖ్య తగ్గుతుందని ఆకాంక్షించారు.
సోనూ సూద్
"ప్రతి రోజూ సాయం చేయండంటూ నాకు ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. ఇది అసాధ్యమని తెలుసు. కానీ తప్పకుండా వీరందరినీ ఆదుకుంటానని అనుకుంటున్నా. చూద్దాం ఈ ఉత్తరాల సంఖ్య ఎప్పటికీ తగ్గుతుందో" అంటూ సోనూ వ్యాఖ్య రాసుకొచ్చారు.
ఇదీ చూడండి 'చిరుతో రెండు రీమేక్‌లు అలా కుదిరాయి'
Last Updated : Oct 23, 2020, 9:08 PM IST