తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్టార్​ టెన్నిస్​ ప్లేయర్స్​కు​ తండ్రిగా విల్​స్మిత్ - ది కింగ్‌ రిచర్డ్'

టెన్నిస్​ స్టార్ క్రీడాకారిణులు వీనస్​ విలియమ్స్​, సెరెనా విలియమ్స్​ల​ తండ్రి బయోపిక్​లో హాలీవుడ్​ స్టార్​ హీరో విల్​స్మిత్ నటిస్తున్నాడు. ​నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

The King Rechard movie
వీనస్‌, సెరెనా తండ్రి పాత్రలో 'విల్​స్మిత్'

By

Published : Feb 29, 2020, 8:07 PM IST

Updated : Mar 2, 2020, 11:57 PM IST

అంతర్జాతీయ టెన్నిస్‌ ప్లేయర్స్ వీనస్‌ విలియమ్స్, సెరెనా విలియమ్స్‌ తండ్రి రిచర్డ్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ది కింగ్‌ రిచర్డ్'. ఇందులోని రిచర్డ్‌ పాత్రను విల్‌స్మిత్‌ పోషిస్తున్నాడు. రొనాల్డో మార్కస్‌ గ్రీన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

నిజజీవిత ఆటగాళ్లయిన జాన్‌ మెకెన్రో, పీట్‌ సంప్రాస్‌.. ఈ సినిమాలో అదే పాత్రల్లో కనిపించనున్నారు. వీనస్‌గా సన్నియా సిడ్నీ, సెరెనా పాత్రలో డెమి సింగిల్‌స్టోన్‌ నటిస్తోంది. జనవరిలో లాస్‌ ఏంజెల్స్​లో షూటింగ్ మొదలైంది. ఈ ఏడాది నవంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు.

వీనస్‌, సెరెనా తండ్రి పాత్రలో 'విల్​స్మిత్'

ఇదీ చూడండి.. ఆ మూడు రోజులు 24x7 నాన్​స్టాప్​ షోలు

Last Updated : Mar 2, 2020, 11:57 PM IST

ABOUT THE AUTHOR

...view details