అభిమానుల కోసం మరింత కష్టపడతానని చెప్పాడు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్.30 ఏళ్లుగా తనను ప్రేమతో ఆదరిస్తున్నారని... అందుకే వారి అంచనాలను అందుకునేలా సినిమాలు చేస్తానని అన్నాడు. ఐఫా అవార్డ్స్-2019 విలేకరుల సమావేశానికి హాజరైన అతడు ఫ్యాన్స్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.
"1989లో 'మైనే ప్యార్ కియా' సినిమా తర్వాత నాకు, అభిమానులకు మధ్య బంధం పెరిగింది. అప్పట్నుంచి 'భాయ్', 'భాయ్‌జాన్' అని పిలుస్తూ తమలో ఒకడిగా చూసుకుంటున్నారు. ఇది సాధించడానికి చాలా సమయం పట్టింది. ఈ ఎదుగుదలతో పాటు, నాకున్న అభిమానులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వారి కోసం మరింత కష్టపడాలని అనుకుంటున్నా. నన్ను ఎలా అయితే వాళ్లు చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రలకే ఎక్కువ ప్రధాన్యమిస్తాను".