మొదటి భార్య షెరీ జంపినోతో విడాకులు తీసుకోవడమే తన జీవితంలో అతిపెద్ద వైఫల్యమని అన్నాడు హాలీవుడ్ స్టార్ విల్‌స్మిత్. ఫాదర్స్‌డే సందర్భంగా రెడ్టేబుల్ షోలో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నాడు. తన విజయాలతో పాటు జీవితంలోని అనేక విశేషాలను వెల్లడించాడు.
"విడాకులు తీసుకోవడం నా జీవితంలో నిరుపయోగమైన విషయం. ఆ సంఘటన నా జీవితంలో అతిపెద్ద వైఫల్యం. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. అయితే అలా చేయాల్సిన పరిస్థితులు ఏంటో అర్థం కాలేదు"
విల్‌స్మిత్, హాలీవుడ్ నటుడు
1992-1995 వరకు షెరీ జంపినోతో ఉన్న విల్‌స్మిత్.. 1997లో పింకెట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి జేడెన్ అనే కుమారుడుతో పాటు, 19 ఏళ్ల కుమార్తె ఉంది.
విల్ స్మిత్.. 'మెన్ ఇన్ బ్లాక్', 'ద పర్ష్యూట్ ఆఫ్ హ్యాపీనెస్', 'అల్లాదీన్' తదితర సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని అలరించాడు.