'బాహుబలి' నటుడు ప్రభాస్, 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిస్తే ఎలా ఉంటుంది. ఇండియా మొత్తం అబ్బురపడేలా ఉంటుంది. అలాంటిది నిజంగా వీరిద్దరూ ఓ సినిమా తీస్తే అద్భుతం. హీరో ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ వార్త అధికారికంగా ప్రకటించనప్పటికీ, వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలో దీనిపై ఓ స్పష్టత వస్తుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
'కేజీఎఫ్' దర్శకుడితో ప్రభాస్.. ప్రకటన ఎప్పుడంటే? - ప్రభాస్ ప్రశాంత్ నీల్ కొత్త చిత్రం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రాబోతుందని సమాచారం. దీనిపై వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఓ స్పష్టత రానుందట.
కేజీఎఫ్ దర్శకుడితో ప్రభాస్.. ప్రకటన ఎప్పుడంటే?
ప్రశాంత్ చెప్పిన కథకు ప్రభాస్ ఇప్పటికే అమోదం తెలిపారని చెప్పుకుంటున్నారు. 'కేజీఎఫ్' సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న హోంబాలే సంస్థనే ఈ సినిమా నిర్మించనుందట. ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్' చిత్రం చేస్తున్నారు. ఆ తరువాత ఓం రౌత్ 'ఆదిపురుష్'తో పాటు నాగ్ అశ్విన్‌తో ఓ సైన్ ఫిక్షన్ మూవీకి ఒప్పుకున్నారు.