పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్(ramcharan pawankalyan) కలిసి ఒకే తెరపై కనువిందు చేయనున్నారా? అంటే అవుననే మాట్లాడుకుంటున్నాయి సినీవర్గాలు. మలయాళ హిట్ 'డ్రైవింగ్ లైసెన్స్'(driving license telugu remake) తెలుగు రీమేక్ హక్కుల్ని రామ్‌చరణ్ ఎప్పుడో కొన్నారు. అయితే ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది? తెలుగులో ఎవరెవరు చేస్తారు? అనేది ఇంతవరకు స్పష్టత రాలేదు. అయితే కొద్ది రోజులుగా దాని గురించి మళ్లీ మాట్లాడుకుంటున్నారు. పవన్, చరణ్ ఈ రీమేక్‌లో ప్రధాన పాత్రలు పోషించనున్నారని టాక్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట! త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి. అంతకుముందు పవన్, రవితేజ కలిసి నటిస్తారని ప్రచారం సాగింది.
'డ్రైవింగ్ లైసెన్స్'(driving license movie remake in telugu) హిందీ రీమేక్‌లో అక్షయ్‌కుమార్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.