ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనిల్ దేవగణ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన సోదరుడు, నటుడు అజయ్ దేవగణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అనిల్ అకాల మరణంతో కుటుంబసభ్యులు ఎంతగానో ఆవేదన చెందుతున్నారని తెలిపారు.
"గతరాత్రి నా సోదరుడు అనిల్ దేవగణ్ తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం మా కుటుంబాన్ని ఎంతో దహించివేస్తోంది. వ్యక్తిగతంగా నేను ఆయనని ఎంతగానో మిస్ అవుతున్నా. ఆయన ఆత్మ శాంతి కోసం ప్రార్థించండి. కరోనా మహమ్మారి కారణంగా వ్యక్తిగత ప్రార్థన సమావేశం ఉండదు."