తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​ మాల్యాను మహేశ్ వెనక్కి తీసుకొస్తారా? - sarkaru vaari paata latest story updates

పరశురామ్​ దర్శకుడిగా సూపర్​స్టార్​ మహేశ్​బాబు ప్రధానపాత్రలో 'సర్కారు వారి పాట' చిత్రం తెరకెక్కబోతోంది. తాజాగా ఈ సినిమా కథాంశంపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. మూవీలో ప్రిన్స్​ బ్యాంక్​ మేనేజర్​గా నటించనున్నట్లు సమాచారం.

Will Mahesh bring Mallya back to India in Sarkar Vaari Paata
మహేశ్ విజయ్​ మాల్యాను వెనక్కి తీసుకొస్తారా?

By

Published : Jun 22, 2020, 8:36 PM IST

సూపర్​స్టార్​ మహేశ్​ బాబు హీరోగా.. పరశురామ్​ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. 'సరిలేరు నీకెవ్వరు' బిగ్గెస్ట్​ హిట్​ తర్వాత వస్తున్న​ ఈ చిత్రంలో మహేశ్​ సరికొత్త లుక్​లో కనిపించనున్నారు. లాక్​డౌన్​ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఇంతవరకు ప్రారంభంకాలేదు. తాజాగా ఆంక్షలు సడలించినప్పటికీ.. మహేశ్​ మాత్రం షూటింగ్​ విషయంలో తొందరపడకూడదని నిర్ణయించుకున్నారట.

తాజాగా ఈ చిత్ర కథాంశంపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్​ ఈ సినిమాలో ఓ బ్యాంక్​ మేనేజర్​ పాత్రను పోషిస్తున్నారని సమాచారం. దేశంలో విజయ్ మాల్యా వంటి అతిపెద్ద రుణ ఎగవేతదారులలో ఒకరిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే నేపథ్యంలో మూవీ రూపొందుతోందట. ఫ్లాష్ బ్యాక్​లో ఛేజింగులు, యాక్షన్​ తదితర సన్నివేశాల కోసం భారతీయ, హాలీవుడ్​ సాంకేతిక నిపుణులు పని చేయనున్నట్లు తెలుస్తోంది.

సర్కారు వారి పాట

చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్​ పనులపై ఇప్పటికే దృష్టి పెట్టిందట. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో విదేశాల్లో షూటింగ్ సాధ్యం కాదు కాబట్టి స్థానిక ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జులైలో సినిమా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:మహేశ్‌ మెడపై రూపాయి పచ్చబొట్టుకు ఇంత కథ ఉందా?

ABOUT THE AUTHOR

...view details