తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇండియన్ సూపర్ హీరో క్రిష్ వచ్చేస్తున్నాడు..! - krish-4

క్రిష్​ సిరీస్​లో ఇప్పటికే వచ్చిన మూడు భాగాలు ఘనవిజయాలు అందుకున్నాయి. ఇప్పుడు నాలుగో భాగానికి సమయాత్తమవుతోంది చిత్రబృందం. త్వరలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిస్తామని హృతిక్​ రోషనే స్వయంగా చెప్పాడు. ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేసే అవకాశముంది.

క్రిష్

By

Published : Oct 4, 2019, 8:00 AM IST

హాలీవుడ్​లో సూపర్​మ్యాన్​, స్పైడర్​ మ్యాన్​, బ్యాట్​మ్యాన్​ లాంటి హీరోలు ఉన్నారు. కానీ భారత్​లో ఎవరు అంటే గుర్తొచ్చేది క్రిష్. ఈ పాత్ర హృతిక్ రోషన్ తప్ప మరొకరు చేయలేరు అనేంతగా లీనమైపోయాడు. ఇప్పటివరకు మూడు భాగాలు రాగా.. త్వరలో నాలుగో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయం స్వయంగా హృతిక్ రోషనే చెప్పాడు.

"క్రిష్ సిరీస్​ను ముందుకు తీసుకెళ్లాలని నాకూ ఉంది. ఇప్పుడే వార్ చిత్రం వచ్చింది. దీని తర్వాతా మా నాన్నతో(రాకేశ్​ రోషన్​) చర్చించి పునఃప్రారంభిస్తాం. ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కోలుకునేంత వరకు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాం. ఇప్పుడు ఆయన పరిస్థితి మెరుగైంది. వెంటనే ప్రారంభిస్తాం " -హృతిక్ రోషన్​, బాలీవుడ్ హీరో

ఈ సిరీస్​లో మొదటి చిత్రం కోయీ మిల్​ గయా(2003), అనంతరం క్రిష్(2006), క్రిష్​-3(2013) సినిమాలు వచ్చాయి. ఈ మూడింటికి రాకేశ్ రోషనే దర్శకత్వం వహించాడు. అయితే క్రిష్-4కు హృతిక్​తో కాబిల్​ తెరకెక్కించిన సంజయ్​ గుప్తా దర్శకుడిగా వ్యవహరించే అవకాశముంది. 2020లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.

ఇదీ చదవండి: కంగనా​ను కొట్టాడు.. నాపై యాసిడ్​ పోశాడు: రంగోలీ

ABOUT THE AUTHOR

...view details