లోకనాయకుడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భారతీయుడు 2'. లాక్డౌన్ కారణంగా గతేడాది షూటింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్, నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్ మధ్య విభేదాలు తలెత్తాయి.
ఇంతలోనే తన తర్వాతి రెండు చిత్రాలను రామ్‌చరణ్, రణ్వీర్ సింగ్‌లతో రూపొందించనున్నట్లు శంకర్ ఇటీవలే ప్రకటన చేశారు. దీంతో 'భారతీయుడు 2' ప్రాజెక్టు పక్కనపెట్టినట్లేనని కోలీవుడ్ వర్గాలు అనుకున్నాయి. అయితే ఈ సినిమా పూర్తయ్యే వరకు మరే ప్రాజెక్టు చేయరాదని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కోర్టును ఆశ్రయించింది.