కింగ్ నాగార్జున కథానాయకుడిగా అహిషోర్ సాల్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వైల్డ్‌డాగ్'. ఈ సినిమా ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంటోంది. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఇప్పటికే హక్కులు పొందినట్లు వార్తలొస్తున్నాయి. మే మూడోవారంలో డిజిటల్ మీడియాలో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మే మూడో వారంలో 'వైల్డ్‌డాగ్' ఓటీటీ రిలీజ్! - వైల్డ్‌డాగ్ ఓటీటీ రిలీజ్
హైదరాబాద్ బాంబు పేలుళ్ల నేపథ్యంతో కింగ్ నాగార్జున హీరోగా రూపొందిన చిత్రం 'వైల్డ్‌డాగ్'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశేషాదరణ దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైనట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
మే మూడో వారంలో 'వైల్డ్‌డాగ్' ఓటీటీ రిలీజ్!
నాగార్జున ఇందులో ఎన్‌ఐఏ ఏజెంట్ విజయ్ వర్మగా కనిపించగా సయామీఖేర్ రా ఏజెంట్‌గా నటించింది. దియా మీర్జా, అతుల్ కుల్‌కర్ణి, అలీ రెజా, అనీష్ కురువిళ్ల, ప్రకాష్ సుదర్శన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంరజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. షానైల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా శ్రావణ్ కటికనేని ఎడిటర్‌గా పనిచేశారు. కిరణ్ కుమార్ డైలాగ్స్ రాశారు.
ఇదీ చూడండి:రొమాంటిక్ కామెడీ కథతో సిద్ధమైన ఆది!