తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీ బాలీవుడ్ ఎంట్రీ... నిజమేనా..? - icon

త్వరలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. వేణు శ్రీరామ్​ దర్శకత్వంలో రూపొందే 'ఐకాన్'​ను హిందీలోనూ తెరకెక్కించాలని చిత్రబృందం భావిస్తోందట.

అల్లు

By

Published : Aug 25, 2019, 10:45 AM IST

Updated : Sep 28, 2019, 4:51 AM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్​' చేయనున్నాడు బన్నీ.

అయితే ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. అల్లు అర్జున్​కు​ హిందీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అక్కడ డబ్​ అయిన అతడి చిత్రాలకు వస్తోన్న స్పందనను చూస్తే ఇది అర్థమవుతుంది. ఇదే జోరులో వేణు శ్రీరామ్​ దర్శకత్వంలో బాలీవుడ్​లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట స్టైలిష్ స్టార్. ఈ మూవీలో బన్నీ సరసన దిశా పటానీ హీరోయిన్​గా నటిస్తోందని సమాచారం.

ఇవీ చూడండి.. 'వెంకీమామ'లో రాశి ఖన్నా పాత్ర ఇదేనా ..!

Last Updated : Sep 28, 2019, 4:51 AM IST

ABOUT THE AUTHOR

...view details